విజయ్ 62వ సినిమా టైటిల్ ,ఫస్ట్ లుక్ ఎప్పుడంటే !

విజయ్ 62వ సినిమా టైటిల్ ,ఫస్ట్ లుక్ ఎప్పుడంటే !

Published on Jun 18, 2018 8:00 PM IST

తమిళ స్టార్ హీరో ‘ఇళయదళపతి’విజయ్ పుట్టిన రోజు సందర్బంగా అయన నటిస్తున్న 62 వ చిత్రం యొక్క టైటిల్ ను అలాగే ఫస్ట్ లుక్ ను ఈ నెల 21న సాయంత్రం 6 గంటలకి విడుదల చేయనున్నారు . ఈ నెల 22 న ఆయన పుట్టినరోజు కావడం విశేషం . తూత్తుకుడి లో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సారి అయన తన పుట్టినరోజు ను జరుపుకోవడం లేదని మనకు తెలిసిందే.

ఇక విజయ్ నటిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది . ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ , యోగిబాబు , రాధారవి మొదలగు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు . సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకీ ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.’మెర్సల్’ సినిమా విజయం తరువాత విజయ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు