‘బిగిల్’ సినిమాలో విజయ్ క్యారెక్టర్స్ ఇవే

Published on Jun 29, 2019 1:00 am IST

తలపతి విజయ్ కొత్త చిత్రం ‘బిజిల్’ 85 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుని చివరి దశలో ఉంది. ఇటీవలే సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. విడుదలైన రెండు పోస్టర్లలో రెండు, మూడు గెటప్లలో కనిపించడంతో ఇంతకీ సినిమాలో విజయ్ రెండు పాత్రల్లో కనిపిస్తారా లేకపోతె మూడు పాత్రల్లో కనిపిస్తారా అనే విషయమై అభిమానుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది.

తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు విజయ్ రెండు పాత్రల్లో మాత్రమే కనిపిస్తారని తెలుస్తోంది. వాటిలో తండ్రి పాత్ర పేరు బిజిల్ కాగా కొడుకు పాత్ర పేరు మైఖెల్ అట. ఇక కథానాయిక నయనతార ఏంజెల్ అనే పాత్రలో కనిపించనుంది. గతంలో అట్లీ కుమార్, విజయ్ కాంబినేషన్లో ‘మెర్సల్, తేరీ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చి ఉండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

More