విజయ్ తదుపరి చిత్రం మళ్ళి ఆ దర్శకుడితోనే !

విజయ్ తదుపరి చిత్రం మళ్ళి ఆ దర్శకుడితోనే !

Published on Jul 17, 2018 9:00 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న’ సర్కార్ ‘చిత్రంలో నటిస్తున్నాడు. పొలిటికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలకానుంది.

ఇక ఈ చిత్రం తరువాత విజయ్ తన 63 వ చిత్రాన్ని యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇంతకుముందు వీరిద్దరి కలయికలో వచ్చిన తేరి , మెర్సల్ చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఇక ఇప్పుడు విజయ్ మూడోసారి ఈ దర్శకుడుకి అవకాశం ఇవ్వనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు