విజయ్ కి విలన్ గా మరో విజయ్….!

విజయ్ కి విలన్ గా మరో విజయ్….!

Published on Sep 18, 2019 10:51 AM IST

తలపతి విజయ్ ప్రస్తుతం బిగిల్ చిత్రం పూర్తి చేసేపనిలో బిజీగా ఉన్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు నడుస్తున్నాయి. యంగ్ డైరెక్టర్ అట్లీ, విజయ్ లది హిట్ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. కాగా విజయ్ తన తదుపరి చిత్రం దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.

విజయ్ 64వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రతి నాయకుడిగా విలక్షణ హీరో విజయ్ సేతుపతి చేస్తారని గతంలో వార్తలు రావడం జరిగింది. కాగా విజయసేతుపతి ఈ చిత్రంలో చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని తాజాగా అందుతున్న సమాచారం. విజయసేతుపతి ఓ ప్రక్క హీరోగా చేస్తూనే తెలుగులో సైరా, ఉప్పెన వంటి చిత్రాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటిస్తున్నారు. కనుక విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్ గా చేస్తాడన్న విషయాన్నీ కొట్టిపారేయలేం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు