విజేత ట్రైలర్ విడుదల !

విజేత ట్రైలర్ విడుదల !

Published on Jun 24, 2018 10:03 PM IST

కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘విజేత’ ట్రై లర్ కొద్దిసేపటిక్రితం విడుదలయింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్ర పతాకం ఫై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక చిత్ర ట్రైలర్ చూస్తుంటే తండ్రి , కొడుకుల మధ్య సాగె కథ నేపథ్యంలో తెరకెక్కిందిగా అనిపిస్తుంది . తండ్రి పాత్రలో మురళీశర్మ నటించగా కొడుకు పాత్రలో కళ్యాణ్ దేవ్ నటించాడు .రాజీవ్ కనకాల , సత్యం రాజేష్ , సుదర్శన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మాళవిక నాయర్ కథానాయికగా నటించింది .

రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బాహుబలి చిత్రానికి చాయాగ్రాహకుడిగా పనిచేసిన సెంథిల్ కుమార్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు . హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రం జులై లో ప్రేక్షకుల ముందుకు రానుంది .

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు