విజయ్ ఆంటోనీ “కిల్లర్”రంజాన్ కానుకగా 7న విడుదల

విజయ్ ఆంటోనీ “కిల్లర్”రంజాన్ కానుకగా 7న విడుదల

Published on Jun 2, 2019 4:00 AM IST

ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటించిన చిత్రం ‘కొలైగారన్‌’. ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. అషిమా క‌థానాయిక‌ గా నటిస్తుండగా సైమన్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు..

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా కి భారీ డిమాండ్ ఏర్పడింది.. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ పొందగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రంజాన్ కానుకగా జూన్ 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది..

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. “యాక్ష‌న్ కింగ్ అర్జున్ , హీరో విజయ్ ఆంటోనీ లు నటించిన “కిల్లర్” చిత్రానికి తెలుగులో మంచి బిజినెస్ జరిగింది.. ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లర్ అంశాలు అన్ని ఇందులో ఉన్నాయి.. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. సెన్సార్ పూర్తయ్యింది.. జూన్ 7 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం”, అన్నారు. ఆశిమా నార్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్ లు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు