విక్రమ్ – ఛార్మీ స్పెషల్ సాంగ్ కోసం 2.5 కోట్ల సెట్

విక్రమ్ – ఛార్మీ స్పెషల్ సాంగ్ కోసం 2.5 కోట్ల సెట్

Published on Oct 9, 2014 5:45 PM IST

chari-vikram
బ్యూటిఫుల్ అండ్ బబ్లీ హీరోయిన్ ఛార్మీ ఇప్పటి వరకూ టాలీవుడ్ లో హీరోయిన్ గానే కాకుండా అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపించి భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇప్పుడు ఛార్మీ కోలీవుడ్ లో కూడా ఓ స్పెషల్ సాంగ్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తమిళ స్టార్ హీరో విక్రమ్ హీరోగా సమంత హీరోయిన్ గా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ’10 ఎన్రాదుకుల్ల’ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాకి చాలా కీలకమైన ఓ స్పెషల్ సాంగ్ లో ఛార్మీ కనిపించనుంది. ఇది అన్ని సినిమాల్లోలా చేసే స్పెషల్ సాంగ్ లా కాకుండా కథలో భాగంగా బాగా నాటకీయంగా ఉండే ఈ పాట నిడివి 9 నిమిషాలు. ఈ స్పెషల్ సాంగ్ కోసం ప్రస్తుతం పూణే దగ్గర లోని ఓ హిల్ ప్రాంతంలో సుమారు 2.5కోట్లు ఖర్చు పెట్టి ఓ సెట్ ని రూపొందిస్తున్నారు.

ఈ నెల 20వ తేదీ పైన ఛార్మీ ఈ స్పెషల్ సాంగ్ కి సంబందించిన షూటింగ్ ని మొదలు పెడుతుంది. ఇది కాకుండా ఛార్మీ ప్రస్తుతం ‘మంత్ర 2’ సినిమాలో నటిస్తోంది. అలాగే పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చేయనున్న ఓ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.

తాజా వార్తలు