విక్రమ్ కొత్త సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే..

Published on Sep 10, 2019 6:47 pm IST

ఇటీవలే ‘కదరమ్ కోండన్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు చియాన్ విక్రమ్. ఈ చిత్రం తెలుగులో ‘మిస్టర్ కె కె’గా విడుదలై జస్ట్ ఓకే అనిపించుకుంది. ప్రస్తుతం విక్రమ్ తన తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని అజయ్ ఙ్ఞానముత్తు డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఈ నెల 21 నుండి మొదలుకానుంది.

విక్రమ్ ఇలా సినిమాకి సినిమాకి పెద్దగా గ్యాప్ తీసుకోకుండా వెంట వెంటనే సినిమాలు చేస్తుండటం పట్ల డేట్స్ తీసుకున్న నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారట. వయకామ్, 7 స్క్రీన్ స్టుడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం 2020కి ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

X
More