తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధ్రువ నట్చత్తిరమ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తుంది . ఇక ఈచిత్ర షూటింగ్‌ను ఈవారంలో పూర్తి చేసి చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్స్ రాధికా, సిమ్రాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నా ఈ చిత్రంలో విక్రమ్ సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక విక్రమ్ ఈసినిమా తరువాత ‘తూంగవనం’ ఫెమ్ రాజేష్ ఎమ్ సెల్వం తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు.


