పురాణ కాలంనాటి డ్రామా సినిమా కోసం సిద్దమవుతున్న విక్రమ్

పురాణ కాలంనాటి డ్రామా సినిమా కోసం సిద్దమవుతున్న విక్రమ్

Published on Apr 29, 2018 3:24 PM IST

ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రముఖ హీరోలలో కథను బట్టి, అందులోని పాత్రని బట్టి వారి శరీర తత్వాన్ని, పర్సనాలిటీని ఎప్పటికప్పుడు మార్చుకోగలిగే హీరో అంటే విక్రమ్ అని కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. తన పాత చిత్రం అయిన శివ పుత్రుడు నుండి మొదలు పడితే అపరిచితుడు, మల్లన్న, అలా మొన్నటికి మొన్న శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ వరకు తేరా ముందు ఎంత అద్భుతంగా వినుత్నమైన గెటప్స్ తో కనిపిస్తాడో తెరవెనుక కూడా అతని కష్టం అంటే ఉంటుంది. అదే తరహాలో ఇప్పుడు మరోసారి తన అభిమాన నటులను ఆశ్చర్యపరిచేలా ‘మహా వీరకర్ణ’ సినిమాతో అలరించనున్నాడు.

ఆర్ఎస్ విమల్ దర్శకత్వంలో విక్రం ప్రధాన పాత్రలో కర్ణుడిగా తెరకేక్కబోతున్న ఈ చిత్రం బహుళ భాషలలో విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు. ఆ కాలం నాటి నిజమైన కర్ణుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఈ సారి మాత్రం విక్రం ఇదివరకటి కంటే ఎక్కువ మోతాదులో జిమ్ లో కష్టపడుతున్నాడు. సినిమాలో తాను పోషించే పాత్రకు సరైన న్యాయం చేయడానికి ఎంత కష్టమైనా దాన్ని సాదిన్చాదానికి నేను సిద్దం అని విక్రం అన్నాడు.

ఈ ఏడు అక్టోబర్ నెలలో చితం సెట్స్ పైకి వెళ్లబోతుండగా వచ్చే 2019 డిసెంబర్ నెల నాటికి న్యు ఇయర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలకోసం వేచి చూద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు