భారీ సీక్వెల్ తో సెప్టెంబర్ లో రాబోతున్న స్టార్ హీరో !

భారీ సీక్వెల్ తో సెప్టెంబర్ లో రాబోతున్న స్టార్ హీరో !

Published on Aug 13, 2018 1:07 PM IST

తమిళ స్టార్ హీరో విక్రమ్, త్రిషలు జంటగా దర్శకుడు హరి రూపొందించిన చిత్రం ‘సామి’. 2003లో వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా విక్రమ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సామీ స్క్వేర్. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ పై చిత్రబృందం ఓ క్లారిటీకి వచ్చిందని తెలుస్తోంది.

కాగా సెప్టెంబర్లో వినాయక చవితి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్లు కూడా ప్రారంభమైయాయి. కీర్తి సురేష్ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాబీ సింహ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తమీన్స్ ఫిలిమ్స్ పతాకం ఫై శిబు తమీన్స్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు