మేమనుకున్న మేజిక్ విక్రం స్క్రిప్ట్ లో దొరికింది – నాగ్

మేమనుకున్న మేజిక్ విక్రం స్క్రిప్ట్ లో దొరికింది – నాగ్

Published on May 4, 2014 9:10 PM IST

manam
అక్కినేని ఫ్యామిలీ హీరోలైన స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘మనం’. అక్కినేని ఫ్యామిలీ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మనం సినిమా మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా కథ ఎలా మొదలైంది అనే విషయం గురించి నాగార్జున చెబుతూ ‘ మేము ముగ్గురం సినిమా సినిమా చేయాలనుకున్నప్పుడు మా దగ్గరికి చాలా కథలు వచ్చాయి. అవన్నీ తండ్రి, కొడుకు, మనవడు కాన్సెప్ట్ తోనే వచ్చాయి. కానీ ఒక్కసారి విక్రమ్ కథ విన్నాక మేము ఎదురు చూస్తున్న మేజిక్ ఆ కథలో ఉందని వెంటనే ఓకే చేసానని’ అన్నాడు.

సమంత, శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో నీతూ చంద్ర ఓ అతిధి పాత్రలో కనిపించనుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాకి హర్ష వర్ధన్ డైలాగ్స్ అందించాడు. ఎఎన్ఆర్ నటించిన చివరి సినిమా కావడంతో నాగార్జున, అక్కినేని కుటుంబ సభ్యులు ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తాజా వార్తలు