సూపర్ స్టార్ రజినీకాంత్ నటించగా మోషన్ కాప్చ్యూర్ టెక్నాలజీతో షూట్ చేసిన సినిమా ‘విక్రమసింహా’. ఈ మూవీ మే 9న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మేము విన్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదా పడనుంది. కానీ ఈ విషయం పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ కొన్ని ఏరియాల్లో విక్రమసింహా బుకింగ్స్ కూడా ఆపేశారు. ఈ విషయంపై కచ్చితమైన ప్రకటన ఈ చిత్ర ప్రొడక్షన్ టీం నుంచి వెలువడాల్సి ఉంది.
అలాగే ఈ సినిమా రజినీకాంత్ దే అయినా సినిమా ప్రమోషన్స్, క్రేజ్ కూడా తక్కువగానే ఉంది. చాలా మంది తెలియని వాళ్ళు ఇదొక యానిమేషన్ సినిమా అని అనుకుంటున్నారు. దానివల్ల ఈ సినిమాకి పెద్ద క్రేజ్ లేదని చెప్పచ్చు. సౌందర్య రజినీకాంత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించింది.


