విక్రమ్ ‘మిస్టర్.kk’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

విక్రమ్ ‘మిస్టర్.kk’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Jul 3, 2019 10:04 AM IST

స్టార్ హీరో విక్రమ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కదరం కొండన్’, తెలుగులో ‘మిస్టర్ kk’గా రాబోతుంది. కాగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకం పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ట్రైలర్ మొత్తానికి సాయంత్రం విడుదలవుతుంది. మరి ఈ ట్రైలర్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

ఇక ఈ ‘కదరం కొండన్’ను తమిళంలో ఈ నెల 19న విడుదల చెయ్యాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో కూడా జూలై 19నే విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జూలై 19న కొబ్బరి మట్టా, ఆమె చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ‘చీకిటి రాజ్యం’ ఫేమ్ రాజేష్ ఎమ్ సెల్వ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమానైనా విక్రమ్ హిట్ ఇస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు