కోటి వ్యూస్ దాటిన విక్రమ్ ట్రైలర్ !

కోటి వ్యూస్ దాటిన విక్రమ్ ట్రైలర్ !

Published on Jun 11, 2018 3:00 PM IST

Saamy

తమిళ స్టార్ ‘చియాన్ విక్రమ్’ హీరోగా మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సామీ స్క్వేర్’. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విక్రమ్ అభిమానులకు బాగా నచ్చింది. ఇప్పటికే యూట్యూబ్ లో కోటి వ్యూస్ ను దాటింది. లాగే లక్షా తొంబై వేల లైక్స్ ను కూడ సొంతం చేసుకుంది. ట్రైలర్ లో ముఖ్యంగా విక్రమ్ యాక్షన్, దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో విక్రమ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో మరియు డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారు. 2003లో విడుదల అయిన సామి పార్ట్ వన్ సూపర్ హిట్ కావడంతో, పోలీస్ స్టోరీలు తీయడంలో హరి స్పెషలిస్ట్ కావడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో విక్రమ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. శిబూ తమీన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగష్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి :

తాజా వార్తలు