మొన్న బాహుబలి, నేడు రజినీకాంత్ లింగా..!

మొన్న బాహుబలి, నేడు రజినీకాంత్ లింగా..!

Published on Jul 3, 2014 5:08 PM IST

rajini-kanth
అనాజ్ పూర్, రంగారెడ్డి జిల్లా గ్రామస్తులు మరోసారి సినిమా చిత్రీకరణను అడ్డుకుని వార్తలలో నిలిచారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘లింగా’. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ పక్కనే ఉన్న అనాజ్ పూర్ గ్రామంలో జరుగుతుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో చెరువులో కెమికల్స్ కలుపుతున్నారని, తద్వారా మంచినీరు కలుషితం అవుతుందంటూ గ్రామస్తులు షూటింగ్ అడ్డుకున్నారు. ఇరిగేషన్ డిపార్టుమెంటు, గ్రామపంచాయితీ శాఖల వద్ద పర్మిషన్ తీసుకున్నామని చిత్ర యూనిట్ చెప్పినా గ్రామస్తులు షూటింగ్ కొనసాగించడానికి ఒప్పుకోలేదు. గతంలో అనాజ్ పూర్ గ్రామస్తులు బాహుబలి సినిమా చిత్రీకరణను కూడా ఆడ్డుకున్నారు. రామోజీ ఫిలిం సిటీని అనాజ్ పూర్ గ్రామం అనుకుని ఉండడంతో సినిమా షూటింగ్ చేయడానికి అనువుగా ఉంటుందని దర్శకనిర్మాతలు ఈ గ్రామంవైపు మొగ్గుచూపుతున్నారు.

రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజిని సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతి బాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు