ముందుగా బాలయ్యతోనా.. వెంకీతోనా.. ?

Published on Apr 8, 2019 7:00 pm IST


ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వరుస హిట్స్ అందుకున్న వినాయక్ కి ప్రస్తుతం పరిస్థితులు అంతగా అనుకూలించట్లేదు. నట సింహం నందమూరి బాలకృష్ణతో ఎప్పుడో మొదలు ఆవ్వాల్సిన సినిమా ఇంకా ప్రారంభం కూడా కాలేదు. దీనికి తోడు మరో పక్క బాలయ్య తన తరువాత సినిమాను బోయపాటితో ఫిక్స్ అయిపోయాడు. దాంతో వినాయక్ ఇక చేసేదేం లేక ఆ మధ్యలో వెంకటేష్ కి ఓ లైన్ చెప్పాడు.

కానీ వెంకీ కూడా ఇప్పటికే ‘వెంకీమామ’ షూట్ లో బిజీగా ఉన్నాడు, పైగా వెంకీ మామ తరువాత నక్కిన త్రినాధరావుతో సినిమా చెయ్యడానికి అంగీకరించాడు. మరి ఈ లెక్కన వినాయక్ సినిమా ఎప్పుడో అర్ధం కానీ పరిస్థితి. అయితే వినాయక్ మాత్రం తన తరువాత చిత్రాన్ని బాలయ్యతో గాని, వెంకీతో గాని ఉంటుందని చెప్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వినాయక్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట. ఈ సినిమాకి రచయిత గోపిమోహన్ కూడా రచన చేస్తున్నారు. ఇంతకీ వినాయక్ ముందుగా బాలయ్యతో చేస్తాడా లేక వెంకేటేష్ తో చేస్తాడా అని తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :