స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకేక్కిన సినిమా ‘అల్లుడు శీను’. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ దర్శకుడు తూర్పు గోదావరి జిల్లలో గల సూర్యదేవర ఆలయంలో పూజలు నిర్వహించారు. రాజముండ్రికి 60 కిలోమీటర్ల దూరంలో మామిడాడ గ్రామంలో ఈ ఆలయం ఉంది.
‘అల్లుడు శీను’ సినిమాలో బ్రాహ్మి – ప్రకాష్ రాజ్ ల మధ్య కామెడీ ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం ధీమాగా చెప్తున్నారు. కొత్త హీరో అయినా సాయి శ్రీనివాస్ చాలా బాగా చేశాడని సీనియర్ నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, తమన్నా ప్రత్యెక గీతం సినిమాకు అదనపు ఆకర్షణ. కుమారుడి తోలి సినిమా కావడంతో నిర్మాత బెల్లంకొండ సురేష్ భారి లెవెల్లో సినిమాను రిచ్ గా తెరకెక్కించారు.


