టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్స్ లో ఒకరైన వివి వినాయక్ ప్రస్తుతం ‘అల్లుడు శీను’ కమర్షియల్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అయినప్పటికీ వివి వినాయక్ మార్క్ వలన అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోంది.
ప్రస్తుతం వివి వినాయక్ తన తదుపరి సినిమాపై దృష్టి పెడుతున్నాడు. మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వినాయక్ ‘అదుర్స్’ సీక్వెల్ పై ఆసక్తి చూపుతున్నాడని సమాచారం. అదుర్స్ సినిమా ఎన్.టి.ఆర్ – వివి వినాయక్ ల కాంబినేషన్లో పెద్ద హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సీక్వెల్ కి సరిపోయే స్క్రిప్ట్ కోసం చూస్తున్నారు. ఈ సినిమా సీక్వెల్ పై ఎన్.టి.ఆర్ – వివి వినాయక్ ఇద్దరూ ఆసక్తిగా ఉన్నారు. ఒకవేళ ఈ సినిమా సెట్స్ పైకి వెళితే ఎన్.టి.ఆర్ అభిమానులకు ఇదొక ట్రీట్ అని చెప్పవచ్చు. మరి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందో లేదో అనేది చూడాలి..


