వినోద్ ఫిల్మ్ అకాడమీ (VFA) ఆరవ వసంతంలోకి అడుగుపెట్టిన శుభసందర్భంగా సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా, ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ బ్యానర్‌పై ‘ప్రొడక్షన్ నెంబర్ 1’ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. వినోద్ కుమార్ నువ్వుల స్వయంగా నిర్మించి, కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రణయ్‌రాజ్ వంగరి దర్శకత్వం వహిస్తుండగా, తల్లాడ సాయికృష్ణ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు.
ముహూర్తపు దృశ్యానికి సీనియర్ నటులు ఎల్బీ శ్రీరామ్ క్లాప్ కొట్టగా, ప్రముఖ దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులకే ఈ సినిమాలో ప్రాధాన్యత కల్పిస్తుండటం విశేషం. కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, ప్రతిభావంతులైన యువతను వెండితెరకు పరిచయం చేయడమే తన లక్ష్యమని సంస్థ అధినేత వినోద్ కుమార్ నువ్వుల ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో నటులు రాజాశేఖర్ ఆనింగి, జబర్ధస్త్ జీవన్, స్వప్న చౌదరి, కిషోర్ దాస్ తదితర ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వినోద్ ఫిల్మ్ అకాడమీ క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇస్తోందని, నూతన నటీనటులకు ఇదొక గొప్ప వేదికని అతిథులు కొనియాడారు. ఈ చిత్రానికి నిక్షయ్ శెట్టి ఛాయాగ్రహణం, లలిత్ కిరణ్ సంగీతం అందిస్తున్నారు.


