హత్యాయత్నం కేసులో వినోద్ కుమార్ అరెస్ట్!

హత్యాయత్నం కేసులో వినోద్ కుమార్ అరెస్ట్!

Published on Nov 17, 2015 3:35 PM IST

Vinod-Kumar
తెలుగు సినీ పరిశ్రమలో 90వ దశకంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించి మెప్పించిన నటుడు వినోద్ కుమార్ తాజాగా ఓ హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయ్యారు. సచ్చిదానంద అనే వ్యక్తిపై హత్యాయత్నం చేశాడన్న నేరంపై పోలీసులు ఈ ఉదయం వినోద్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వినోద్ కుమార్, అతడి స్నేహితుడు ఉదయ్‌తో కలిసి సచ్చిదానందపై హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదైంది.

వివరాల్లోకి వెళితే.. వినోద్ కుమార్ ఆర్థిక వ్యవహారాలు చూసుకునే సచ్చిదానందను ఓ భారీ వాహనంతో గుద్దించి హత్య చేయాలని వినోద్, అతడి స్నేహితుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక దీన్ని ఓ ప్రమాదంగా చిత్రించాలని కూడా ఈ ప్లాన్‌లో భాగం చేశారని సమాచారం. ఈ ప్లాన్ ప్రకారమే ఆదివారం ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో పుత్తూరులో వినోద్ కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సెక్షన్ 307 కింద వినోద్ కుమార్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

తాజా వార్తలు