వైరల్ పిక్స్ : బీస్ట్ మోడ్ లో సూపర్ స్టార్ మహేష్.!

Published on Mar 2, 2023 10:00 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే మరియు యంగ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న సినిమా కోసం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా జానర్ కి తగ్గట్టుగానే సూపర్ స్టార్ మహేష్ మంచి అగ్రెసివ్ లుక్ లోకి మారుతున్నారు.

ఆల్రెడీ తన హెయిర్ స్టైల్ ని కంప్లీట్ గా మార్చేయగా ఇప్పుడు అయితే తన బాడీ లుక్ ని ఓ రేంజ్ లో మార్చే పనిలో ఉన్నారని చెప్పాలి. లేటెస్ట్ గా మహేష్ నుంచి వచ్చిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఫైర్ ని సెట్ చేసాయి. జిమ్ లో వర్కౌట్ చేస్తూ మహేష్ తన సాలిడ్ బాడీ ని చూపిస్తున్నారు. దీనితో ఈరోజు బీస్ట్ మోడ్ లో ఉన్న మహేష్ షాకింగ్ లుక్స్ సోషల్ మీడియాలో యిట్టె వైరల్ అయిపోయాయి. మొత్తానికి అయితే ఈ సినిమాలో మాత్రం మహేష్ ని నెక్స్ట్ లెవెల్లో చూడబోతున్నామని అనేది క్లియర్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :