వైరల్ : “RRR” స్పెషల్ షో చూసిన ప్రముఖ ఐపీఎల్ టీం.!

Published on May 4, 2022 9:01 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అన్ని భాషల్లోని అంచనాలను రీచ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా ఈ చిత్రం తెలుగు మరియు హిందీ భాషల్లో మంచి రెస్పాన్స్ తో థియేటర్స్ లో సాలిడ్ రన్ తో దూసుకెళ్తుంది.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమాని ప్రస్తుతం ఐపీఎల్ లో రాణిస్తున్న సరికొత్త యంగ్ టీం స్పెషల్ షో చూడడం వైరల్ గా మారింది. అదే యంగ్ క్రికెటర్ కే ఎల్ రాహుల్ సారథ్యంలో గట్టి పోటీతో సాగుతున్న టీం “లక్నో సూపర్ జెయింట్స్”. నిన్న రాత్రి ఈ సినిమా స్పెషల్ షో ని వారి టీం అంతా కూడా హిందీ వెర్షన్ లో చూసి ఎంజాయ్ చేశారు.

మరి దీనిపై ఈ సినిమా క్యాప్టెన్ కే ఎల్ రాహుల్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చెయ్యగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా ఈ సినిమా చూస్తూ వారంతా ఎంజాయ్ చేస్తున్నది వైరల్ అవుతుంది. మొత్తానికి అయితే ఈ సినిమా హవా ఇంకా ఇలా కొనసాగుతుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :