వైరల్ పిక్ : స్వాతంత్ర సమరయోధురాలి పాత్రలో ఆకట్టుకుంటున్న అనసూయ

వైరల్ పిక్ : స్వాతంత్ర సమరయోధురాలి పాత్రలో ఆకట్టుకుంటున్న అనసూయ

Published on Aug 14, 2023 4:05 PM IST

Anasuya as Begum Hazrat Mah

నటి అనసూయ భరద్వాజ్ కొన్నేళ్ల క్రితం రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రతో అందరినీ అలరించారు. అనంతరం పుష్ప లో ఆమె పోషించిన దాక్షాయణి పాత్ర కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే విషయం ఏమిటంటే ఇటీవల విమానం సినిమాలో సుమతి అనే వేశ్య పాత్రలో నటించిన అనసూయ తాజాగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు బేగం హజ్రత్ మహల్ పాత్రలో కనిపించిన లేటెస్ట్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సమరయోధుల పట్ల తనకు ఉన్న అంకితభావాన్ని తెలియచేస్తూ బేగం హజ్రత్ పాత్రలో ఉన్న పిక్ ని తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో షేర్ చేసారు అనసూయ. ఇక ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు చరిత్ర మనకు గొంతెత్తి తెలియచేయని మహోన్నత వీర మహిళలైన బేగం హజ్రత్ మహల్ వంటి వారి గురించి తెలుసుకుందాం అంటూ ఆమె తన పోస్ట్ లో తెలిపారు. స్వాతంత్ర పోరాటం మొదలైన తొలినాళ్లలో 1856 లో బ్రిటీష్ సైనికులు ఉత్తరప్రదేశ్ లోని ఆవాద్ ను స్వాధీనం చేసుకున్న అనంతరం తిరుగుబాటు చేసిన బేగం హజ్రత్ వారి నుండి లక్నో ని స్వాధీనం చేసుకుని తన కుమారుడైన బిర్జిస్ ఖద్ర ఆవాద్ పాలకుడిగా ప్రకటించారు.

తాజా వార్తలు