వైరల్ : తన తల్లితో బ్యూటిఫుల్ పోస్ట్ షేర్ చేసిన రామ్ చరణ్.!

వైరల్ : తన తల్లితో బ్యూటిఫుల్ పోస్ట్ షేర్ చేసిన రామ్ చరణ్.!

Published on Aug 25, 2022 9:00 AM IST

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తో తమ కెరీర్ లో 15వ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పుడు చిన్న బ్రేక్ లో ఉన్న చరణ్ ఈ గ్యాప్ ని తన కుటుంబంతో హ్యాపీగా గడుపుతున్నాడు. మరి అలా ఇప్పుడు లేటెస్ట్ గా తాను సోషల్ మీడియాలో పంచుకున్న పోస్ట్ అభిమానులను హ్యాపీ చేస్తూ మంచి వైరల్ గా మారింది.

తన మాతృమూర్తి సురేఖ తో తీసుకున్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని ఈ ఉదయం షేర్ చేసి “ఇంతకన్నా మంచి పోస్ట్ తో నేను నా ఈరోజుని స్టార్ట్ చెయ్యకుండా ఉండలేనని” తెలుపుతూ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. దీనితో ఈ ఉదయమే తమ అభిమాన హీరో ఇంత హ్యాపీ గా ఫీల్ అవుతూ పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ గ్యాప్ తర్వాత అయితే రామ్ చరణ్ సెప్టెంబర్ మొదటి వారంలో శంకర్ సినిమా షూట్ లో పాల్గొననున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు