వైరల్ వీడియో: ‘మెగా 158’ లాంచ్ లో మెగా బ్రదర్స్ హ్యాపీ మూమెంట్స్!

వైరల్ వీడియో: ‘మెగా 158’ లాంచ్ లో మెగా బ్రదర్స్ హ్యాపీ మూమెంట్స్!

Published on May 21, 2026 10:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు నటించనున్న భారీ చిత్రాల్లో తన కెరీర్ 158వ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా తాలూకా ముహూర్త కార్యక్రమాన్ని మేకర్స్ అత్యంత గ్రాండ్ గా నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే ఓ లాంచ్ కార్యక్రమాన్ని ఈ రేంజ్ లో చేస్తారా అంటే కే వి ఎన్ సంస్థకి ఇది తెలుగులో మొదటి సినిమా పైపెచ్చు మెగాస్టార్ లాంటి లెజెండరీ హీరో కావడంతో అసలు ఆరంభమే నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు.

ఇక ఈ ఈవెంట్ కి మెగాస్టార్ సహా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లు ముఖ్య అతిధులుగా వస్తారని చెప్పారు. అయితే అంతకు మించిన సర్ప్రైజ్ లు ఈ కార్యక్రమంలో ప్లాన్ చేశారు. చిరు, పవన్ తో పాటుగా నాగబాబు కూడా ఈ ఈవెంట్ లో హాజరు కావడం మెగా ఫ్యాన్స్ లో మరో బ్యూటిఫుల్ మూమెంట్ గా మారింది.

అయితే ఈ ముగ్గురిపై కొన్ని హ్యాపీ మూమెంట్ విజువల్స్ వైరల్ గా మారాయి. చిరు, పవన్ లు కలిసి ఏదో మాట్లాడుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తుండగా ఇద్దరినీ చూస్తూ నాగబాబు మురిసిపోతున్నారు. దీనితో ఈ క్రేజీ మూమెంట్ వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమానికి వివి వినాయక్, బండ్ల గణేష్, దిల్ రాజు తదితర ప్రముఖులు కూడా హాజరయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు