ఎమోషనల్ పోస్ట్ చేసిన కోహ్లి !

ఎమోషనల్ పోస్ట్ చేసిన కోహ్లి !

Published on Mar 8, 2021 7:20 PM IST

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ జంట అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తమ కుమార్తె వామికాను ఎత్తుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ మహిళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ కి లోనయ్యారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కోహ్లి పోస్ట్ చేస్తూ.. ‘పిల్లల పుట్టుకను చూడటం ఒక గొప్ప అనుభూతి అని చెప్పాలి. అది నిజంగా మాటల్లో వర్ణించలేని అద్భుతమైన అనుభవం.

పిల్లల జన్మను ప్రత్యక్షంగా చూసిన తరువాత మహిళల నిజమైన బలం, దైవత్వాన్ని అర్థం చేసుకుంటారు. దేవుడు వారి కడుపులో మరో జీవితాన్ని సృష్టించాడు. ఎందుకంటే వారు పురుషుల కంటే బలంగా ఉన్నారు కాబట్టే. నా జీవితంలో ఇది మరిచిపోలేని విషయం. నా కూతురు కూడా ఆమె తల్లిలా ఎదుగుతుందని భావిస్తున్నాను. ప్రపంచంలోని అద్భుతమైన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.’ అంటూ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

https://www.instagram.com/p/CMJZFGpF-E0/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు