పెళ్ళికి ససేమిరా అంటున్న స్టార్ కిడ్…!

Published on Aug 14, 2019 9:20 am IST

స్టార్ కిడ్ వరలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా నటించిన చిత్రం “కన్ని రాశి”. విమల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ముత్తుకుమరన్ దర్శకత్వం వహిస్తుండగా, షమీమ్ ఇబ్రహం నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశాలంలో పాల్గొన్నారు.

కాగా ఈ సందర్భంగా తన పెళ్లి విషయం గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు వరలక్ష్మి, తనకు పెళ్లిచేసుకునే ఉద్దేశం లేదని షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఐతే గతంలో కూడా ఈ భామ పెళ్లి విషయంలో విముఖత తెలిపారు. కాగా నటుడు విశాల్, వరలక్ష్మి చాలా కాలం ప్రేమికులుగా కొనసాగడం జరిగింది. కారణాలేమైనా పెళ్లివరకు వచ్చిన వారి బంధం అనుకోకుండా చెదిరిపోయింది.వీరిద్దరూ విడిపోయిన చాలా కాలం ఎవరిదారిన వారు గుట్టుగా ఉన్నారు. ఐతే నడిగర్ సంగం ఎన్నికలలో తలెత్తిన వివాదాల కారణంగా ఇద్దరు బద్ద శత్రువులుగా మారారు.

సంబంధిత సమాచారం :