అలా అయితే తన బయోపిక్ లో నటిస్తా అంటున్న కోహ్లీ!

అలా అయితే తన బయోపిక్ లో నటిస్తా అంటున్న కోహ్లీ!

Published on May 19, 2020 11:00 PM IST

మొత్తం మన దేశంలో ఉన్న అన్ని సినీ ఇండస్ట్రీలలో బయోపిక్ సినిమాలు అంటే మంచి క్రేజ్ ఏర్పడింది. పలు రంగాల్లో ఆరితేరిన సెలెబ్రేటిస్ అలాగే సమాజంలో ఎలాంటి గుర్తింపు కూడా కోరుకోకుండా పని చేసే వారిపై ఇలాంటి బయోపిక్ చిత్రాలు అనేకం వచ్చాయి. వాటిలో స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు కూడా చాలానే వచ్చాయి. అలాంటి వాటిలో టీం ఇండియా క్యాప్టెన్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బయోపిక్ పై కూడా మంచి హైప్ ఉంది.

అయితే దీనిపై కోహ్లీ మన దేశపు ఫుట్ బాల్ టీం క్యాప్టెన్ సునీల్ ఛెత్రితో ఇటీవలే జరిపిన ఇన్స్టాగ్రామ్ లైవ్ లో ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. తన బయో పిక్ లో తన సతీమణి అనుష్క శర్మ కూడా ఈ చిత్రంలో నటిస్తే ఖచ్చితంగా తన బయోపిక్ లో తాను నటిస్తా అని సెలవిచ్చారు. ఆమె ఉంటేనే నటిస్తా అని లేకుంటే అసలు చెయ్యనని కోహ్లీ సమాధానం ఇచ్చారు. దీనితో అన్ని వర్కవుట్ అయితే కింగ్ కోహ్లీ సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు