‘విరాటపర్వం’లోని మ‌హిళా పాత్రల గొప్పతనం !

Published on Mar 8, 2021 11:30 am IST

రానా – సాయి పల్లవి కలిసి చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. దర్శకుడు ‘వేణు ఉడుగుల’ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం నుండి అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా ఒక ప్ర‌త్యేక వీడియోను రిలీజ్ చేశారు మేక‌ర్స్. రానా వాయిస్ ఓవ‌ర్‌ తో వచ్చిన ఈ వీడియోలో విరాట పర్వంలోని మహిళాల పాత్రలను పరిచయం చేస్తూ వారి పాత్రల తాలూకు గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమాలో జాతీయ అవార్డు గెలుచుకున్న నటీమణులు నందితా దాస్ , ప్రియామణి కీలక పాత్రల్లో కనిపిస్తుండటం విశేషం. అలాగే ఈశ్వరి రావు మరియు జరీనా వహాబ్, నివేదా పేతురాజ్ ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో న‌వీన్ చంద్ర‌, సాయిచంద్ ముఖ్య‌పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం :