‘మజ్ను’ డైరెక్టర్ తో సినిమా ఇప్పట్లో లేనట్లేనా ?

Published on Nov 5, 2019 12:00 am IST

‘ఉయ్యాల జంపాల, మజ్ను’ చిత్రాల దర్శకుడు విరించి వర్మతో కళ్యాణ్ రామ్ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. కాగా విరించి వర్మ నందమూరి కళ్యాణ్ రామ్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడట. స్క్రిప్ట్ కూడా కళ్యాణ్ రామ్ కి వినిపించినట్లు తెలుస్తోంది. అయితే కళ్యాణ్ రామ్ కి కథ నచ్చినా.. ఇప్పటికే అంగీకరించిన సినిమాల కారణంగా ఈ సినిమాని పోస్ట్ ఫోన్ చేశాడట. ఈ లోపు దర్శకుడికి వేరే సినిమా చేసుకొని రమ్మని చెప్పినట్లు సమాచారం. మరి విరించి వర్మ ఏం చేస్తాడో చూడాలి.

ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘ఎంత మంచివాడవురా’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి పోటీలో దిగనుంది. ఇప్పటికే మహేష్ సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రాలతో పాటు రజిని కాంత్ దర్బార్ మూవీ కూడా సంక్రాంతికి పోటీగా వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :