శర్వానంద్ కోసం ట్రై చేస్తోన్న యంగ్ డైరెక్టర్ !

Published on May 23, 2019 1:00 am IST

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘తుగ్లక్’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాల దర్శకుడు విరించి వర్మతో కళ్యాణ్ రామ్ సినిమా చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం విరించి వర్మ కళ్యాణ్ రామ్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేసాడట. ఈ సినిమా ఈ ఆగష్టు నుండి షూటింగ్ ను మొదలయ్యేలా కనిపిస్తోంది. అయితే విరించి వర్మ ఆ తరువాత ప్రాజెక్ట్ కోసం శర్వానంద్ కోసం కూడా ట్రై చేస్తున్నాడట. శర్వానంద్ కోసం పల్లెటూరి నేపథ్యంలో ఓ మంచి కథ రాసినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More