మెగా హీరో, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ విరూపాక్ష. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మంచి కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా లో సంయుక్త మీనన్ లేడీ లీడ్ రోల్ లో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కనబరుస్తూ, మంచి వసూళ్లను రాబడుతోంది.
ఈ చిత్రం 10 రోజుల్లో 76 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇదే జోరును కొనసాగిస్తే, ఈ వారాంతానికి 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా, శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించడం జరిగింది.


