వారిద్దరికీ పోటీగా విశాల్ కూడా…?

Published on Sep 19, 2019 11:45 pm IST

విశాల్ లేటెస్ట్ మూవీ యాక్షన్. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తుండగా దర్శకుడు సి సుందర్ ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ విశేష ఆదరణ దక్కించుకోవడంతో పాటు రికార్డు వ్యూస్ సాధించింది. కాగా ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రణాళిక వేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందట.

కాగా ఇప్పటికే దీపావళి రేసులో విజయ్ బిగిల్ మూవీతో పాటు, కార్తీ ఖైదీ చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు తమ విడుదల షెడ్యూల్ దీపావళిగా నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు యాక్షన్ చిత్ర నిర్మాతల నిర్ణయంతో దీపావళి పోటీలో విశాల్ కూడా దిగినట్లైంది. దీనితో ముగ్గురు హీరోల చిత్రాలతో దీపావళి పోరు ఆసక్తికరంగా మారింది. యాక్షన్ మూవీలో విశాల్ సరసన తమన్నా, ఐశ్వర్య లేక్ష్మి నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More