‘మహానటి , అభిమన్యుడు’ విజయాలను సెలబ్రేట్ చేసుకున్న కీర్తి , విశాల్ !

‘మహానటి , అభిమన్యుడు’ విజయాలను సెలబ్రేట్ చేసుకున్న కీర్తి , విశాల్ !

Published on Jun 24, 2018 7:26 PM IST

ఇటీవల వారు నటించిన చిత్రాలు ఘన విజయాలను సాధించడంతో ఆ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు యువ కథానాయిక కీర్తి సురేష్ మరియు హీరో విశాల్ .వీరిద్దరూ’ సందకోడి2′ చిత్ర షూటింగ్ లో ఈ విజయాలను సెలబ్రేట్ చేసుకున్నారు .
ఇటీవల కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే ఈ చిత్రం తమిళ భాషలో ‘నడిగాయిర్ తిలగం’ పేరుతో విడుదలై అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది . ఇక విశాల్ నటించిన ‘ఇరుంబు తీరాయ్’ చిత్రం ఇటీవల విడుదల ఘన విజయం సాధించింది ఈ చిత్రం తెలుగులో అభిమన్యుడు పేరుతో విడుదలై విశాల్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించింది ఈ సందర్బంగా వీరిద్దరూ సెలబ్రేట్ చేసుకున్నారు

ఇక వీరిద్దరూ కలిసి ప్రస్తుతం’ సందకోడి 2′ చిత్రంలో నటిస్తున్నారు .లింగుసామి తెరెకెక్కిస్తున్న ఈ చిత్రం 2005 లో విశాల్ , మీరా జాస్మిన్ జంటగా తెరకెక్కి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సందకోడి చిత్రానికి సీక్వెల్ గా వస్తుంది . తెలుగులో పందెంకోడి 2 గా రానున్న ఈ చిత్రం విజయదశమి కానుకగా విడుదలకానుంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు