మరో సీక్వెల్ కు ఓకే చెప్పిన యాక్షన్ హీరో !

Published on Apr 16, 2019 1:00 pm IST

యాక్షన్ హీరో విశాల్ వరుస సీక్వెల్స్ ను లైన్లో పెట్టాడు. అందులో భాగంగా ఇటీవలే బ్లాక్ బ్లాస్టర్ మూవీ ఇరుంబు తిరై(అభిమన్యుడు ) సీక్వెల్ ఇరుంబు తిరై 2 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అతి త్వరలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇప్పుడు విశాల్ మరో సీక్వెల్ కు కూడా ఓకే చెప్పాడు. మిస్కిన్ డైరెక్షన్ లో విశాల్ నటించిన తుప్పరివలాన్ (డిటెక్టీవ్) 2017లో విడుదలై సూపర్ హిట్ ఆయ్యింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా తుప్పరివలాన్ 2 తెరకెక్కనుంది.

విశాల్ ప్రస్తుతం సుందర్ సీ తో ఓ సినిమా చేస్తున్నాడు. టర్కీ లో ఈ చిత్రం యొక్క షూటింగ్ జరుగుతుంది. ఇక సెట్ లోనే మిస్కిన్ , విశాల్ ను కలిసి తుప్పరివలాన్ 2 స్క్రిప్ట్ వినిపించాడట. స్క్రిప్ట్ బాగా నచ్చడంతో వెంటనే విశాల్ సినిమాకు ఓకే చెప్పాడట. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం స్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :