వరలక్ష్మి మంచి ఫ్రెండ్ మాత్రమే – విశాల్ !

వరలక్ష్మి మంచి ఫ్రెండ్ మాత్రమే – విశాల్ !

Published on Jun 12, 2018 1:51 AM IST

vishal varalakshmi

ఇటీవల అభిమన్యుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు హీరో విశాల్ ఈ చిత్రం ఇప్పటివరకు 12 కోట్ల పైచిలుకు షేర్ ని కలెక్ట్ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది . దింతో చిత్ర బృదం తెలుగు రాష్ట్రాల్లో విజయాత్ర లో పాల్గొంటున్నారు .

విశాల్ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు . వరలక్ష్మి ని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమైనా వుందా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి విశాల్ తెలివిగా సమాదానం చెప్పాడు . వరలక్ష్మి నేను మంచి ఫ్రెండ్స్ మాత్రమే చాలా క్లోజ్ గా ఉంటాం అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని అన్నాడు . అలాగే స్ట్రయిట్ గా తెలుగు సినిమాలో నటిస్తానని విశాల్ ఈ సందర్బంగా వివరించారు . గతంలో వరలక్ష్మి , విశాల్ పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి . వరలక్ష్మి ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె .

తాజా వార్తలు