టెర్రరిజం పై విశాల్ యాక్షన్…!

Published on Aug 15, 2019 9:45 pm IST

హీరో విశాల్ ఇటీవల అయోగ్య మూవీతో కోలీవుడ్ లో మంచి హిట్ అందుకున్నాడు. కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా విశాల్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. వెంకట్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటించింది. ఈ చిత్రం 2015లో ఎన్టీఆర్, పూరి కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

కాగా విశాల్ తాజా చిత్రం “యాక్షన్” పేరుతో తెరకెక్కుతుంది. దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో తమన్నా, ఐశ్వర్య లేక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతుంది. నేడు ఈ మూవీ సెకండ్ లుక్ ని విడుదల చేయడం జరిగింది. చేతిలో గన్ పట్టుకొని స్టయిలిష్ గా నిల్చొని ఉన్న విశాల్ లుక్ కేకగా ఉంది. ఈ మూవీ టెర్రరిజం పై ఓ అధికారి చేసే పోరాటం అని తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుందని సమాచారం.

సంబంధిత సమాచారం :