ఏప్రిల్ 14న విశాల్ స్ట్రెయిట్ మూవీ ఓపెనింగ్

ఏప్రిల్ 14న విశాల్ స్ట్రెయిట్ మూవీ ఓపెనింగ్

Published on Feb 27, 2015 2:10 PM IST

vishal
తమిళంలో మాస్ హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న తెలుగబ్బాయి విశాల్. విశాల్ నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ అయ్యింది. ఇక్కడ విశాల్ సినిమాలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో సమానంగా హిట్టయ్యాయి. తెలుగు ప్రేక్షకుల ఆదరణ పట్ల సంతోషం వ్యక్తం చేసిన విశాల్.. ఎప్పటి నుండో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తానని ప్రామిస్ చేస్తూ వచ్చాడు.

నేను నటించబోయే స్ట్రెయిట్ తెలుగు సినిమా ఏప్రిల్ 14న ప్రారంభమవుతుంది. తమిళ సినిమాల కమిట్మెంట్స్ వలన ఈ సినిమా ఆలస్యం అవుతుంది. శశికాంత్ దర్శకత్వంలో స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ ఉంటుందని తాజా ఇంటర్వ్యూలో హీరో విశాల్ వెల్లడించారు.

యువ హీరో నితిన్ హోం బ్యానర్ శ్రేష్ట్ మూవీస్, విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తాయి. త్వరలో హీరోయిన్, టెక్నీషియన్లు తదితర వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు.

తాజా వార్తలు