‘మగ మహారాజు’గా వస్తున్న విశాల్

Vishal
‘పందెం కోడి’ సినిమాతో ప్రారంభమైన విశాల్ జైత్ర యాత్ర తెలుగులో ఆశాజనకంగా సాగుతుంది. తెలుగులో అనువాదమైన విశాల్ పలు సినిమాలు విజయం సాదించాయి. తాజాగా విశాల్ నటిస్తున్న తమిళ సినిమా ‘అంబాల’ను తెలుగులో ‘మగ మహారాజు’గా అనువదిస్తున్నారు.

విశాల్ సరసన హన్సిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సుందర్ సి దర్శకుడు. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు మధురిమ, మాధవి లత కూడా నటిస్తున్నారు. ముగ్గురు సీనియర్ హీరోయిన్లు రమ్యకృష్ణ, ఐశ్వర్య, కిరణ్ లు విశాల్ కి అత్తలుగా కనిపిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాను విశాల్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

Exit mobile version