వరలక్ష్మి వాయిస్తే… విశాల్ కూల్ గా సమాధానం ఇచ్చాడు.

Published on Jun 16, 2019 6:04 pm IST

జూన్ 26న జరగనున్న తమిళ నడిగర సంఘం ఎన్నికలు కోలీవుడ్ లో కాకరేపుతున్నాయి.ప్రస్తుత జనరల్ సెక్రెటరీ గా ఉన్న విశాల్ ,పోయినసారి తనపై పోటీచేసి ఓడిపోయిన శరత్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ వీడియో విడుదల చేయడంతో వివాదం రాజుకుంది. ఈ విషయంపై స్పందిస్తూ శరత్ కుమార్ కూతురైన నటి వరలక్ష్మి విశాల్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రస్తుత ఎన్నికలలో మానాన్న పోటీచేయకున్నప్పటికీ, ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఎన్నికలలో లబ్దిపొందడానికి చాలా దిగజారిపోయావ్ విశాల్ అంటూ ఆమె తీవ్రంగా స్పందించారు.

ఐతే ఈ విషయంపై విశాల్ని ప్రశ్నించగా ఆయన చాలా కూల్ గా స్పందించారు. ఆమె వ్యాఖ్యలు మీరు ఎలా తీసుకుంటారు అని అడుగగా, అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం. ఆమె అభిప్రాయం తెలియపరిచే హక్కు ఆమెకు ఉంది అని, చాలా కూల్ గా జెంటిల్మెన్ సమాధానం చెప్పి వివాదాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. విశాల్,వరలక్ష్మి ఒకప్పటి ప్రేమికులు, వీరిద్దరూ పెళ్ళికి కూడా సిద్దమైన తర్వాత ఏ కారణం చేతనో విడిపోయారు.

సంబంధిత సమాచారం :

X
More