ఈ నెల 27న విడుదలకానున్న విశాల్ ‘మగ మహారాజు’

ఈ నెల 27న విడుదలకానున్న విశాల్ ‘మగ మహారాజు’

Published on Feb 19, 2015 11:47 PM IST

Maga-Maharaju
కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమాలు చేస్తూ హీరో విశాల్ మంచి జోరు కొనసాగిస్తున్నాడు. తమిళ్ లో సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన ‘అంబాల’ తెలుగు లో ‘మగ మహారాజు’ పేరుతో ఈ నెల 27న విడుదలకానుంది. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహించారు.

హన్సిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో మంచి కామెడీ వుంది. శంకర్ విక్రం ల ‘ఐ’ ని ఎదుర్కుని తమిళనాడు తో పాటు ఓవర్సీస్ లో కూడా బాగా వసూలు చేసింది. విశాల్ తన సొంత బ్యానర్ అయిన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పై ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాడు. తన తాజా చిత్రం ‘పూజ’ విజయవంతంకావడంతో ఈ చిత్రాన్ని కొనడానికి బయర్లు ఉత్సాహం చూపుతున్నారు.

తాజా వార్తలు