మంచు విష్ణు ఎడమ చేతిపై టాటూ..

vishnu123
సినిమా కోసం ఎం చేయడానికైనా సిద్ధమయ్యే తెలుగు హీరోలలో మంచు విష్ణు ఒకరు. ప్రతి సినిమాలో విభిన్నంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. ఈ హీరో తాజాగా నటిస్తున్న దేవ కట్టా సినిమా కోసం తన కుట్టించుకున్న మంచు విష్ణు, ఇప్పుడు తన ఎడమ చేతి మీద ఒక పెద్ద టాటూ వేయించుకోవడానికి రెడీ అయ్యారు.

మొదట టాటూ (పచ్చబొట్టు) వేయించుకోవడానికి విష్ణు కొత్త సంశయించారు. ఎందుకంటే, ఇప్పటివరకూ విష్ణు టాటూలకు దూరంగా ఉన్నారు. ఇదే అతని ఫస్ట్ టాటూ. సినిమాలో హీరో చేతిపై టాటూ, ఆ పాత్రలో ఇంటెన్సిటీని బాగా ఎలివేట్ చేస్తుందని దర్శకుడు దేవ కట్టా కన్వీన్స్ చేయడంతో విష్ణు ఓకే చెప్పారు.

మంచు మోహన్‌బాబు సమర్పణలో ప్రతిష్టాత్మకమైన 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళ సినిమా ‘అరిమ నంబి’కి రీమేక్ గా రూపొందుతుంది. ఇటివలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. త్వరలో రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

Exit mobile version