
సినిమా సినిమాకి ఏదో ఒక కొత్త దనాన్ని తెలుగు ప్రేక్షకులకు అని డిఫరెంట్ సినిమాలను ట్రై చేసే యంగ్ హీరో మంచు విష్ణు ట్రై చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘డైనమైట్’. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమా ఫైనల్ వెర్షన్ చూసుకున్న ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్య కాలంలో సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమాకి సరిగా ప్రమోషన్స్ చేసి దానిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ సినిమా గురించి అందరికీ తెలియజేయడం అనేది కూడా కీలకం. అందుకే ఈ సినిమా సక్సెస్ పై సూపర్ కాన్ఫిడెంట్ తో ఉన్న మంచు విష్ణు సరికొత్తగా సినిమాని ప్రమోట్ చెయ్యడానికి సిద్దమయ్యాడు.
అందులో భాగంగానే సినిమా సక్సెస్ అయిన తర్వాత అందరూ సక్సెస్ టూర్ చేస్తారు. కానీ మంచు విష్ణు ఈ సినిమాని అందరికీ రీచ్ అయ్యేలా చెయ్యడం కోసం రిలీజ్ కి ముందే ఓ ప్రమోషనల్ టూర్ ని సిద్దం చేసారు. ఈ ప్రమోషనల్ టూర్ ఆగష్టు 28 నుంచి మొదలు కానుంది. రాజమండ్రి నుంచి మొదలు కానున్న ఈ ప్రమోషనల్ టూర్ ఆంధ్ర మరియు రాయలసీమలోని అన్ని ప్రాంతాలకు వెళ్లనుంది. ఈ టూర్ లో ఈ సినిమా మెయిన్ టీం మొత్తం పాల్గొననుంది. విభిన్న చిత్రల దర్శకుడు దేవకట్టా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ప్రణిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై నిర్మించాడు.

