కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు వారసుడిగా 2003లో ‘విష్ణు’ సినిమాతో హీరోగా పరిచయమైన మంచు విష్ణు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా కొనసాగుతూనే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీని స్థాపించి నిర్మాతగా మారాడు. అటు నిర్మాతగా, హీరోగా బిజీగా ఉంటున్న తన సొంత బ్యానర్ లో బయట హీరోలతో కూడా సినిమాలు చేయాలని ఉందని ఇది వరకూ తెలియజేశాడు. అందులో భాగంగానే బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు హీరోగా ‘సింగం 123’ సినిమాని ప్రారంభించారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకూ హీరోగా, నిర్మాతగా ఉన్న విష్ణు సింగం 123 తో తనలోని మరో టాలెంట్ ని బయటపెట్టాడు. అదే రైటర్.. మాకు అందిన సమాచారం ప్రకారం మంచు విష్ణు ‘సింగం 123’కి కథని అందించాడు. అక్షత్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంపూర్నేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.


