నటుడిగా, నిర్మాతగా పలు విజయవంతమైన డిఫరెంట్ సినిమాలతో మెప్పిస్తూ వస్తోన్న మంచు విష్ణు, తాజాగా ‘డైనమైట్’ పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ ద్వారా మన ముందుకు వచ్చారు. ఇంటెన్స్ కథాంశాలను తనదైన బాణీలో తీస్తాడన్న పేరు తెచ్చుకున్న దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన ‘డైనమైట్’ సినిమా, నేడు ప్రప్రంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైంది. తమిళ సినిమా ‘అరిమ నంబి’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై అంతటా మంచి అంచనాలే ఉండడంతో, విష్ణు కెరీర్లోనే అతిపెద్ద రిలీజ్‌గా ఈ సినిమా విడుదలైంది.
ఇక సినిమా యూనిట్ చాలాకాలంగా చేపడుతూ వచ్చిన ప్రమోషన్స్, సినిమాపై ఉన్న క్రేజ్, అన్నీ కలిపి ఈ సినిమాకు మొదటి రోజు మార్నింగ్, మ్యాట్నీ షోస్ మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. విష్ణు కెరీర్లోనే ఈ సినిమాకు హయ్యస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఉండే సూచనలు ఉన్నాయని ట్రేడ్ టాక్. ఇక దేవాకట్టా ఇంటెన్స్ టేకింగ్, విష్ణు పర్ఫామెన్స్, హై రేంజ్ స్టంట్స్ లాంటివి ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచి అభిమానులు, ప్రేక్షకుల దగ్గర్నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. విష్ణు సరసన ప్రణీత హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జేడీ చక్రవర్తి విలన్‌గా నటించారు.


