మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో ఇంట్రెస్టింగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఆయనే స్వయంగా కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కల్ట్’. హారర్, థ్రిల్లర్ జానర్లలో ఇప్పటివరకు రాని ఒక వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ స్వరాలు సమకూరుస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ప్రోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుండగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను రేపు(సెప్టెంబర్ 19) వెల్లడించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
విశ్వక్ సేన్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు రవి బస్రూర్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ హారర్ థ్రిల్లర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ కల్ట్ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయనున్నారనే విషయంపై రేపు క్లారిటీ రానుంది.



