మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ’(Funky) ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కె.వి.అనుదీప్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయి ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.
అయితే, ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ వర్క్ కొనసాగుతోంది. విశ్వక్ తనదైన డైలాగ్ డెలివరీలతో ఈ సినిమాలో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా దర్శకుడు అనుదీప్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ తన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
అందాల భామ కయాదు లోహర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 13న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
TAKE 1…2…3
And let’s go 😎🔥#FUNKY dubbing in full swing🎙️
&
Gears up to roll into the smashing entertainment zone from FEB 13th 💥#FunkyFrom13thFebMass Ka Das @VishwakSenActor @11Lohar @anudeepfilm #BheemsCeciroleo @vamsi84 #SaiSoujanya @NavinNooli @Venkatupputuri… pic.twitter.com/6FIlwhqrri
— Sithara Entertainments (@SitharaEnts) February 3, 2026
