జాతక రీత్యా రిలీజ్ ను వాయిదా వేసిన విశ్వక్ సేన్ “అశోక వనంలో అర్జున కల్యాణం” టీమ్

Published on Mar 2, 2022 11:30 am IST

యంగ్ హీరో విశ్వక్ సేన్ మరియు రుక్సర్ ధిల్లాన్ జంటగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రం ను మొదట మార్చి 4, 2022 న థియేటర్లలో విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం నిరవధికంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ తమదైన శైలిలో ఫన్నీ గా ప్రకటించడం జరిగింది.

అల్లం అర్జున్ కుమార్ జాతక రీత్యా మార్చ్ 4 వ తేదీన పెళ్లి ముహూర్తం సరికాదని జ్యోతిష్యులు తీర్మానించారు. కావున కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం అంటూ చెప్పుకొచ్చారు. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ సినిమా ను, SVCC డిజిటల్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్ వంటి ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసింది.

సంబంధిత సమాచారం :