మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష అలాగే ఆశిక రంగనాథ్ హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన భారీ చిత్రం “విశ్వంభర”. ఎప్పుడు నుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ సాలిడ్ ఫాంటసీ సినిమాగా వస్తుండగా ఈ తాలూకా టీజర్ కి ఇప్పుడు రంగం సిద్ధం అయ్యింది.
ఈ సినిమా టీజర్ ని మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా అంటే ఈ ఆగస్ట్ 22న విడుదల చేస్తున్నట్టు దర్శకుడు కన్ఫర్మ్ చేసాడు. సో ఈ స్పెషల్ రోజున విశ్వంభర ట్రీట్ మెగా ఫ్యాన్స్ కి రానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టీజర్ తోనే సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.


